Mohini Dey

Mohini Dey: రెహమాన్ శిష్యురాలూ విడాకులు తీసుకుంది!

Mohini Dey: ఆస్కార్ విజేత ఎ. ఆర్. రెహమాన్ విడాకుల ప్రకటన వచ్చిన రోజునే ఆయన శిష్యురాలు కూడా విడాకుల సమాచారాన్ని మీడియాకు ఇవ్వడం చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే… రెహమాన్ ఇష్యూకు మోహినీ డే విడాకులు సంబంధం లేదని లాయర్లు చెబుతున్నారు.

29 సంవత్సరాల వైవాహిక జీవితానికి భారమైన హృదయంతో వీడ్కోలు పలుకుతున్నానని ఎ.ఆర్. రెహమాన్ ప్రకటించిన కొద్ది సేపటికే సంగీత ప్రపంచంలో మరో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇటు రెహమాన్ విడుకులతో పాటు అటు ఆయన శిష్యురాలు మోహినీ డే తన భర్తకు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ రెండు సంఘటనలు ఒకే రోజున… ఒకదాని తర్వాత ఒకటిగా వెలుగులోకి రావడంతో రకరకాల పుకార్లు సోషల్ మీడియాలో చోటు చేసుకున్నాయి. అయితే… పరస్పర అంగీకారంతోనే తన భర్తకు విడాకులు ఇస్తున్నానని, ఇద్దరం కలిసి భవిష్యత్తులోనూ వర్క్ చేస్తామని, తాము అంగీకరించిన ప్రాజెక్ట్స్ ఆగే ప్రసక్తి ఉండదని మోహిని డే తెలిపింది. రెహమాన్ మ్యూజిక్ ట్రూప్ లో సభ్యురాలుగా ఉన్న మోహిని డే దాదాపు 40 కార్యక్రమాలలో రెహమాన్ తో కలిసి వర్క్ చేసింది.

Mohini Dey: ఇటు రెహ్మాన్, అటు మోహని డే డైవర్స్ ఒకే సమయంలో ప్రకటించడంతో వచ్చిన వివాదంపై రెహ్మాన్ లాయర్లు సద్దుబాటు చర్యలు మొదలెట్టారు. ఈ రెండు అంశాలను కలిపి చూడొద్దని, ఎవరి జీవితానికి సంబంధించి వారు తీసుకున్న వ్యక్తిగత నిర్ణయాలు ఇవని తెలిపారు. అలానే రెహమాన్ విడాకుల నిర్ణయం వెనుక కూడా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపలేదని, వారు ఇద్దరూ ఇష్ట ప్రకారంగా విడాకులు తీసుకున్నారని తెలిపారు. ఇదే సమయంలో రెహ్మాన్ కూతురు రహీమా పెట్టిన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్… చాలామందిలో ఆసక్తిని కలిస్తోంది. కవితాత్మకంగా ఆమె పెట్టిన ఆ పోస్ట్ వెనుక నిగూఢ అర్థం దాగి ఉందని కొందరు అంటున్నారు. ఏదేమైనా ఒకటి రెండు రోజులు గడిస్తే గానీ రెహ్మాన్ విడాకులు విషయంలో తెర వెనుక కథలు బయటకు రావు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahaa Vamsi: ఇరికించిన పోసాని..చేతులెత్తేసిన సజ్జల..ఇరుకున్న జగన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *