Giddi Satyanarayana: ప్రతీ సంవత్సరం జులై, ఆగస్టు, సెప్టెంబరు మాసాలు వస్తున్నాయంటే కోనసీమలోని లంక గ్రామాలు చిగురుటాకుల్లా వణికిపోతాయి. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో భయంతో కాలం వెల్లదిస్తారు లంక గ్రామాల ప్రజలు.ధవళేశ్వరం వద్ద 10 అడుగులు దాటే సరికి వచ్చే చిన్నపాటి వరదలకే పి.గన్నవరం మండలంలోని ఊడిమూడిలంక, రిగేలవారిపేట,బూరుగులంక, గంటిపెదపుడి లంక వంటి గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే పరిస్థితి ఇక్కడ నెలకొంటుంది. గత ముప్పై సంవత్సరాల నుంచి ఈనాలుగు లంక గ్రామాలకు ఇదే పరిస్థితి. ఏదైనా అత్యవసర పనులు ఉంటేగాని వీళ్ళు బయటకు వచ్చే పరిస్థితి కనపడదు.
ఈ లంక గ్రామాల ప్రజలు ఉపాధి నిమిత్తం కూలీ పనుల కోసం, విద్యార్ధులయితే స్కూల్, కాలేజి చదువుల కోసం గోదావరి నదిపాయలు దాటి వెళ్ళవలసిందే.ఇక్కడ నదీపాయలపై వంతెనలు లేకపోవడంతో లంక గ్రామాల ప్రజలు ప్రమాదాల అంచున నాటు పడవలపై ప్రయాణించవలసిందే.దీంతో బ్రిడ్జి నిర్మాణం లేక లంక గ్రామాల ప్రజలు పడరని పాట్లు పడుతున్నారు. ఇక్కడి లంక గ్రామాల జనాభా సుమారు 3,000. ఈ నాలుగు లంక గ్రామాల నుంచి స్కూల్, కాలేజీలకు వెళ్ళే విద్యర్థుల సంఖ్య సుమారు 100 మందిపై మాటే… ఈ నాలుగు లంక గ్రామాల ప్రజలు తెల్లవారితే పడవ ప్రయాణం చెయ్యవలసిందే. గోదావరి నదులపై వంతెనలు నిర్మిస్తామన్న మాటలు కేవలం శిలాఫలకాలకే రిమితమవుతున్నాయి. ఏదైనా పడవ ప్రమాదాలు జరిగినపుడు ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు హడావుడి చేసి బాధితులకు నష్టపరిహారాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి.
ఇది కూడా చదవండి: Indian Railways: ఉత్తరాఖండ్ సరిహద్దు వరకూ రైల్వే లైన్.. భారత్ వ్యూహాత్మక చర్య
Giddi Satyanarayana: గంటి పెదపూడిలంక, ఊడిమూడి లంక మధ్య వశిష్ట గోదావరిపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సంబంధిత అధికారులు గుత్తేదారులను ఆదేశించారు. పి.గన్నవరం మండలంలోని ఊడిమూడి లంక, బూరుగులంక, అరిగెలవారిపేట, పెదపూడి లంక గ్రామాలను బాహ్య ప్రపంచంతో కలుపుతూ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నిధులతో రూ. 49.50 కోట్లతో వశిష్ట గోదావరిపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఇటీవల పరిశీలించారు.
ఈ వంతెనను 10 స్పాన్స్ కలిగి ఒక్కొక్కటి 34.2 మీటర్ల పొడవు 7.5 మీటర్ల వెడల్పతో నిర్మిస్తున్నామని.. ఇప్పటికే 40% వరకు నిర్మాణం పూర్తయిందని… రూ. 21 కోట్లతో బిల్ల్స్ అప్లోడ్ చేశామని పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అన్యం రాంబాబు కలెక్టర్‌కు వివరించారు. అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి రైతులకు 4.32 ఎకరాలకు రూ 2.50 కోట్ల రూపాయలు చెల్లించాలని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. త్వరితగతిన బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను గుత్తేదారులను ఆదేశించారు.
Giddi Satyanarayana: పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్టి సత్యనారాయణ అసెంబ్లీలో ఇదే అంశాన్ని లేవనెత్తారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పి.గన్నవరంలో నాలుగు మండలాలు నదీ పరివాహక ప్రాంతం కావడంతో విలువైన లంక భూములు నది గర్భంలో కలిసిపోతున్నాయన్నారు.అదేవిధంగా గంటిపెదపూడి వద్ద గత ప్రభుత్వంలో 49కోట్ల రూపాయల వ్యయంతో బ్రిడ్జ్ సెలక్షన్ అయ్యిందని కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదని.. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శాసనసభలో స్పీకర్‌కు వివరించారు. ఆ అమౌంట్ రిలీజ్ చేస్తే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి స్థానిక ప్రజలకు రాకపోకులకు ఇబ్బందులు లేకుండా చేస్తానన్నారు.
అదే విధంగా మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి కాజ్వే, అయినవిల్లి మండలంలోని ముక్తేశ్వరం కాజ్వే నిర్మాణాలు చేపట్టాలని అసెంబ్లీలో స్పీకర్‌కు విన్నవించుకున్నారు. దీంతో పి.గన్నవరంలోని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే గత వైసీపీ ప్రభుత్వం, హంగూ ఆర్భాటాలు, జగన్ పర్యటనలకే ధనాన్ని దుర్వినియోగం చేయడానికి చూపాయి తప్ప లంక వాసుల కష్టాలు తీరలేదు.ఈ ప్రభుత్వం ప్రజలకు సంబందించినది. దీంతో తమ కష్టాలు గట్టెక్కుతాయని లంక గ్రామాల ప్రజలు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.