Ajith Kumar: తమిళ స్టైలిష్ స్టార్ అజిత్ కుమార్, టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్‌తో కలిసి తన 65వ చిత్రం కోసం చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తారని సమాచారం. కార్తిక్ గతంలో ‘జిగర్తాండ’, ‘పెట్ట’,’మహాన్’ వంటి హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. రీసెంట్ గా సూర్యతో చేసిన ‘రెట్రో’ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు అజిత్‌తో ఆయన కాంబినేషన్ హై ఓల్టేజ్ యాక్షన్, డ్రామాతో కూడిన కథతో రానుందని టాక్. ఈ నేపథ్యంలో AK65పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని, 2026లో విడుదల కానుందని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలుస్తోంది. అజిత్, కార్తీక్ కాంబో అభిమానులకు ఎలాంటి సినిమాటిక్ ట్రీట్ ఇవ్వనుందో చూడాలి.
