Dates

Dates: బరువు తగ్గడానికి ఏ ఖర్జూరం బెటర్..? అసలు ఖర్జూరాలు ఎన్ని రకాలో తెలుసా..?

Dates: ఖర్జూరాలు రుచికరమైన సూపర్ ఫుడ్. అవి ప్రత్యేక పోషకాలతో నిండి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల ఖర్జూరాలు ఉన్నా.. ప్రతిదానికీ భిన్నమైన రుచి, ఆకృతి ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం, బరువు తగ్గడానికి సరైన రకమైన ఖర్జూరాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. బరువు తగ్గాలనుకునేవారు ఏ ఖర్జూరం ప్రయోజనకరంగా ఉంటుందో ముందుగా తెలుసుకోవాలి. డెగ్లెట్ నూర్, బర్హి, అజ్వా, మెడ్‌జూల్, సుక్కరి వంటి 6 ప్రధాన ఖర్జూర రకాలు ఉన్నాయి. వీటిలో బరువు తగ్గడానికి ఏది బెస్ట్​గా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

అజ్వా ఖర్జూరాలు:
అజ్వా ఖర్జూరాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వును తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచి..ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. శరీరంలోని జీవక్రియను వేగవంతం చేసి చెడు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

డాలెట్ నూర్:
ఇతర ఖర్జూరాలతో పోలిస్తే వీటిలో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. ఇవి బరువు తగ్గడానికి మంచి ఎంపిక. వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అదనంగా రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగకుండా చేస్తాయి.

బర్హి ఖర్జూరం :
బర్హి ఖర్జూరం చాలా తీపిగా ఉంటుంది. ఇది చాలా మృదువైనది, జ్యుసిగా ఉంటుంది. ఇది తినడానికి చాలా రుచికరంగా ఉండటమే కాకుండా ఇతర ఖర్జూరాలతో పోలిస్తే ఇందులో అత్యధిక చక్కెర శాతం కూడా ఉంటుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే దీనిని తినకపోవడమే మంచిది.

Also Read: Eggs vs Paneer: బరువు తగ్గాలనుకునే వారికి గుడ్లు లేదా పనీర్ ఏది మంచిది?

మెడ్‌జూల్:
ఖర్జూరాలలో మెడ్‌జూల్​ను రాజు అని పిలుస్తారు. ఇది పరిమాణంలో చాలా పెద్దగా ఉంటుంది. పంచదార పాకంలా రుచిగా ఉంటుంది. కానీ ఇందులో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక మెడ్‌జూల్ ఖర్జూరం 70 కేలరీలకు పైగా కలిగి ఉంటుంది. అయితే దీన్ని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.

సుక్కరి:
సుక్కరి ఖర్జూరాలు చాలా మృదువుగా, తియ్యగా ఉండి నోటిలో కరిగిపోతాయి. ఇతర ఖర్జూరాలతో పోలిస్తే దీని రుచి చాలా బాగుంటుంది. కానీ ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తినేటప్పుడు ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల మీ బరువు తగ్గడానికి ఆటంకం కలుగుతుంది.

బర్హి ఖర్జూరాలు :
బర్హి ఖర్జూరాలు రెండు రకాలు. ఒకటి పాక్షికంగా పొడిగా ఉంటుంది, మరొకటి తాజాగా ఉంటుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే.. మీరు సగం ఎండబెట్టిన తొక్క తీయని ఖర్జూరాలను తినాలి. అవి పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. వాటి రుచి చాలా తీపిగా ఉంటుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది.

ALSO READ  Neem Leaves Benefits: వేప ఆకు వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా? తెలిస్తే ఆశ్చర్యపోతారు..

బరువు తగ్గడానికి ఏవి తినాలి?:
బరువు తగ్గాలనుకునేవారికి అజ్వా, డాగ్లెట్ నూర్ ఉత్తమ ఎంపికలు. ఇవి కాకుండా సెమీ-డ్రై బర్హీని కూడా తినవచ్చు. వాటిని పరిమిత పరిమాణంలో అంటే 2-3 ఖర్జూరాలు తినాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *