Group-3 Exam

Group-3 Exam: గ్రూప్‌-3 హాల్‌టికెట్లు విడుదల.. 17, 18 తేదీల్లో పరీక్ష

Group-3 Exam: తెలంగాణలో నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గ్రూప్-3కి సంబందించిన హాల్ టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ నెల 17న రెండు సెషన్లలో ఈ పరీక్షనిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్-1 ఎక్సమ్ జరగనుంది. అదే రోజు 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరగనుంది. పేపర్-3 18న ఉదయం 10:00 నుంచి 12:30 వరకు జరగనుంది. గ్రూప్-3 పోస్టుల కోసం తెలంగాణాలో  5.36 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.

ఎక్సమ్ సెంటర్ కి అరగంట ముందే చేరుకోవాలి అని చెపుతున్నారు. ఉదయం జరిగే ఎక్సమ్ కి 9:30 తర్వాత, మధ్యాహ్నం జరిగే ఎక్సమ్ కి 2:30 తర్వాత ఎక్సమ్ హాల్ లోకి అనుమతి ఇంచం అని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.

TSPSC గ్రూప్ 3 హాల్ టికెట్ 2024: ఇలా చెక్ చేసుకోండి.. 

  1. tspsc.gov.inలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
  2. హోమ్‌పేజీలో, అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి
  3. మీ లాగిన్ వివరాలు అందులో ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి
  4. TSPSC హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది. 
  5. అదే విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
  6. ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోండి తర్వాత ఉపయోగపడుతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Arunachalam Giri Pradakshina: అరుణాచ‌లంలో తెలుగు భ‌క్తుడి దారుణ హ‌త్య‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *