Group-3 Exam: తెలంగాణలో నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గ్రూప్-3కి సంబందించిన హాల్ టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ నెల 17న రెండు సెషన్లలో ఈ పరీక్షనిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్-1 ఎక్సమ్ జరగనుంది. అదే రోజు 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది. పేపర్-3 18న ఉదయం 10:00 నుంచి 12:30 వరకు జరగనుంది. గ్రూప్-3 పోస్టుల కోసం తెలంగాణాలో 5.36 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.
ఎక్సమ్ సెంటర్ కి అరగంట ముందే చేరుకోవాలి అని చెపుతున్నారు. ఉదయం జరిగే ఎక్సమ్ కి 9:30 తర్వాత, మధ్యాహ్నం జరిగే ఎక్సమ్ కి 2:30 తర్వాత ఎక్సమ్ హాల్ లోకి అనుమతి ఇంచం అని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.
TSPSC గ్రూప్ 3 హాల్ టికెట్ 2024: ఇలా చెక్ చేసుకోండి..
- tspsc.gov.inలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
- హోమ్‌పేజీలో, అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి
- మీ లాగిన్ వివరాలు అందులో ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి
- TSPSC హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది.
- అదే విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
- ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోండి తర్వాత ఉపయోగపడుతుంది.