Vijay Deverakonda

Vijay Deverakonda: జారిపడిన విజయ్ దేవరకొండ!?

Vijay Deverakonda: తక్కువ కాలంలోనే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొంద ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. వీడీ12 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల కేరళలో షెడ్యూల్ పూర్తి చేసి వచ్చాడు విజయ్. తాజాగా ఓ మ్యూజిక్ ఆల్బమ్ కోసం ముంబై వెళ్ళాడు. హిందీలో రూపొందుతున్న ఈ మ్యూజిక్ ఆల్బమ్ లోని పాటలో విజయ్ కి జతగా బాలీవుడ్ హీరోయిన్ రాధికా మదన్ నటిస్తోంది. ‘సాహిబా’ పేరుతో రూపొందే ఈ మ్యూజిక్ ఆల్బమ్ కు పాప్ సింగర్ జస్లీన్ రాయల్ మ్యూజిక్ అందిస్తోంది. ఇక విజయ్, రాధికపై చిత్రీకరించే పాటకు సుధాన్సు సారియా దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ పాట కోసం ముంబై వెళ్ళిన విజయ్ అక్కడ మెట్లు దిగుతుండగా జారి పడ్డారు. అయితే విజయ్ దేవరకొండకు ఎలాంటి గాయాలు కాలేదు. పడిన వెంటనే లేచి మామూలుగా నడుచుకుంటూ వెళ్ళారు విజయ్. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Horoscope: ఈ రాశి వారికి ధనచింత ఉండదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *