Chennai: తెలుగు వారిపై నటి కస్తూరి సెన్సేషనల్ కామెంట్ చేసేన విషయం తెలిసిందే. 300 ఏళ్ల కిందట ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగువాళ్లు.. ఇప్పుడు తమది కూడా తమిళ జాతేనని చెప్పుకుంటుంటే.. శతాబ్దాలకు పూర్వమే ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరెవరు?’’ అని పరోక్షంగా ద్రావిడవాదులను ఆమె ప్రశ్నించారు. ప్రస్తుత తమిళనాడు సీఎం స్టాలిన్ కేబినెట్‌లో ఐదుగురు మంత్రులు తెలుగు మూలాలు ఉన్నవారేనని ఆమె అన్నారు.
’ఇతరుల ఆస్తులను లూటీ చేయొద్దు, పరస్త్రీలపై మోజుపడొద్దు.. ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవద్దు.. అని బ్రాహ్మణులు చెబుతున్నారు. అందుకే వారికి వ్యతిరేకంగా తమిళనాట ప్రచారం సాగుతోంది’’ అని కస్తూరి వ్యాఖ్యానించారు. తమిళనాడు పాలకులు తెలుగు మాట్లాడే వారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కస్తూరి ఆరోపించారు. కస్తూరి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టారు.
కాగా, నటి అజ్ఞాతంలో ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కస్తూరి వ్యాఖ్యలపై తెలుగు సంఘాలు భగ్గుమన్నాయి. మూడు రోజుల క్రితం కస్తూరిపై చెన్నైలో కేసులు నమోదయ్యాయి. సమన్లు ఇచ్చేందుకు పోలీసులు కస్తూరి ఇంటికి వెళ్లారు. కానీ అక్కడ లేకపోవడం చూసి వెనుతిరిగారు. ఆమెను కాంటాక్ట్ అవుదాం అని చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని పోలీసులు తెలిపారు.