Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య 6 గంటల వ్యవధిలో రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. మంగళవారం రాత్రి 11.30 గంటలకు కుప్వారా జిల్లాలోని లోలాబ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఇది ఇంకా కొనసాగుతోంది.
మంగళవారం సాయంత్రం బండిపొరాలోని కెట్సన్ ఫారెస్ట్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బందిపోరాలోని చూంట్‌పత్రి అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
Jammu Kashmir: ఈ సమయంలో, ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరపగా, ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఆ ప్రాంతంలో మరో ఉగ్రవాది దాగి ఉండే అవకాశం ఉంది. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది.
అంతకుముందు నవంబర్ 2న కూడా శ్రీనగర్‌లోని ఖన్యార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు సైనికులు గాయపడ్డారు.