Local Body Elections:

Local Body Elections: స్థానిక సంస్థ‌ల‌ ఎన్నిక‌ల్లో కీల‌క మార్పు!

Local Body Elections: తెలంగాణ రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న పంచాయ‌తీ, ఇత‌ర స్థానిక సంస్థ‌ల‌ ఎన్నిక‌ల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క మార్పు తీసుకురానున్న‌ట్టు స‌మాచారం. గ‌తంలో ఉన్న ఆ నిబంధ‌న‌ను తొల‌గించాల‌ని కాంగ్రెస్ స‌ర్కార్ భావిస్తున్న‌ట్టు ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. ఆ మేర‌కు ముగ్గురు పిల్ల‌ల నిబంధ‌న‌ను తొల‌గించి, అంద‌రికీ అవకాశం క‌ల్పించాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తున్న‌ది.

Local Body Elections: గ‌తంలో ముగ్గురు పిల్ల‌లున్న త‌ల్లిదండ్రులు స్థానిక ఎన్నిక‌ల్లో పోటీకి అన‌ర్హులుగా ఉన్న నిబంధ‌న‌ను ర‌ద్దు చేసే అవ‌కాశం ఉన్న‌ద‌ని స‌మ‌చారం. ఈ మేర‌కు పంచాయ‌తీరాజ్ చ‌ట్టం-2018 సెక్ష‌న్ 21 (3)ని తొల‌గించే ప్ర‌తిపాద‌న‌ను క్యాబినెట్ ముందు ఉంచ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే చ‌ర్చ ఉన్న‌ది. ఇటీవ‌ల బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ అంశం కేంద్రంలో పెండింగ్‌లో పెట్టింది.

Local Body Elections: ఈ నేప‌థ్యంలో 42 శాతం బీసీ రిజ‌ర్వేష‌న్ అంశం చ‌ట్ట‌బ‌ద్ధ‌త కాకుంటే.. మ‌రో అవ‌కాశాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆలోచిస్తున్న‌ది. రాజ‌కీయ పార్టీల వారీగా 42 శాతం బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేసేలా చొర‌వ తీసుకోవాల‌ని భావిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో అంద‌రికీ అవకాశం రావాలంటే ముగ్గురు పిల్ల‌ల నిబంధ‌న‌ను తొల‌గిస్తేనే బాగుంటుంద‌ని కాంగ్రెస్ స‌ర్కార్ భావిస్తున్న‌ది. దీంతో దానిని ఎన్నిక‌ల‌లోగా తొలగించనున్న‌ట్టు తెలుస్తున్న‌ది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  ED Raids: హైదరాబాద్ హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంటిపై ఈడీ దాడులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *