Viral Video

Viral Video: ఇదో పాముల ప్రేమ కథ! ప్రియుడు చనిపోతే.. అక్కడే నిల్చిపోయిన ప్రియురాలు..

Viral Video: జేసీబీ మెషిన్ గోళ్లతో ఒక్క పాము మరణించగా ఇంకో పాముకి గాయాలు అయ్యాయి. ఐతే చనిపోయిన పాము పక్కనే గాయపడిన పాము గంటల తరబడి  నిస్తేజంగా ఉండిపోయింది .  ఈ వింత ఘటనను చూసేందు గుంపులుగా జనం గుమిగూడారు.  అంతమంది జనం అక్కడ గుమిగూడినా కూడా ఆ పాము ఎటూ కదలకుండా చనిపోయిన తన నేస్తం దగ్గరే ఉండిపోయింది .  ఈ సంఘటన అక్కడ ఉన్న ప్రజల్లో ఎమోషన్ తెప్పించింది. వారు కూడా పాము కదులుతుందేమో అనే భయం కంటే.. చనిపోయిన పాముపై రెండో పాముకు ఉన్న ప్రేమకు చలించిపోయారు.

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా నార్వార్ తహసీల్‌లోని ఛత్రి గ్రామంలో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఈ గ్రామానికి చెందిన ఓ రైతు తన భూమిలో  జేసీబీలతో లెవెలింగ్ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక జేసీబీ మెషిన్ గోళ్ల తో భూమిని తవ్వుతున్నపుడు  అక్కడే ఉన్న జంట పాములకు ఆ మెషిన్ గోళ్ల తాకాయి. అంది గమనించిన డ్రైవర్ జేసీబీ దిగి రెండిటిలో ఉన్న ఒక్క పామును ఎత్తుకెళ్లి విసిరేశాడు. ఇంకో పాముని కూడా తీసేద్దాం అని అనుకున్నాడు.  కానీ, అతను పాము దగ్గరకి వెళ్లగానే ఒక్కసారిగా పాడగా విప్పి నించుంది. అది చూసి డ్రైవర్ వెంటనే వెనక్కి వెళ్ళాడు.. గాయపడిన సర్పం మరణించిన పాము దగ్గరికి వెళ్లి గంటల తరబడి  దాని పక్కనే ఉందడంతో ఆ దృశ్యాన్ని చూసేందుకు పక్కనే ఉన్న జనం గుమిగూడారు. ఆలా దాని చుటూ జనం ఉన్న భయపడకుండా పాము అక్కడే ఉండిపోయింది .  

ఇది కూడా చదవండి: ED Raids: సైబర్ మోసాలపై వెస్ట్ బెంగాల్ లో ఈడీ దాడులు

Viral Video: విషయం తెలిసిన భూమి యజమాని సమీపంలోని నార్వార్ పట్టణానికి చెందిన సర్ప్ మిత్రను పిలిచాడు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ ఫ్రెండ్ సల్మాన్ పఠాన్ గాయపడిన పాముకి ప్రాథమిక చికిత్స చేశారు. తర్వాత అక్కడి నుంచి మరణించిన పాముని తొలగించి,  గాయపడిన పామును అడవికి తీసుకెళ్లి సురక్షితంగా వదిలేశాడు.

 ఈ పాములు సుమారు 16-17 సంవత్సరాలు జంటగా కలిసి ఉన్నాయని  సర్ప్ మిత్ర పఠాన్ చెప్పారు. శీతాకాలంలో, పాములు ఎక్కువగా భూగర్భంలో నివసిస్తాయి. అదే సమయంలో యంత్రాలు పనిచేయడంతో వాటికి జేసీబీ మెషిన్ తగిలింది అని చెప్పారు . అందులో ఒక్క పాము చనిపోగానే ఇంకో పాము తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అందుకే ఆ పాము అక్కడే కూర్చుని గంటల తరబడి మూలుగుతూ ఉంది అని సర్ప్ మిత్ర పఠాన్ చెప్పారు.

 

ALSO READ  Badrinath Temple: బద్రీనాథ్ ఆలయం మూసివేత

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *