Nithin: నితిన్ కిప్పుడు అర్జెంట్ గా ఓ హిట్ కావాలి. లేదంటే ఖేల్ కతమ్, దుకాణ్ బంద్ అన్నట్టు తయారైపోతుంది పరిస్థితి.. ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ్ముడు, మనోడి కెరీర్ లోనే హయ్యెస్ట్ డిజాస్టర్ గా మిగిలి పోయింది. బలగం తర్వాత వేణు తీస్తున్న ఎల్లమ్మ తో పాటు.. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్షన్లో కూడా ఓ మూవీ చెయ్యబోతున్నాడు..
Also Read: Niharika: రాఖీ రోజు గుడ్ న్యూస్ గుర్తు చేసుకున్న నిహారిక
వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న నితిన్ కి ఇష్క్ తో మంచి సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కె కుమార్.. ఇప్పుడు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ ఫిల్మ్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.. స్వారీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. నితిన్ కి జోడీగా హాట్ బ్యూటీ పూజా హెగ్డేని ఫిక్స్ చేశారని సమాచారం. ఇప్పటికే పూజాని కలిసి కథ చెప్పారని, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ అంటున్నారు. ఈ మధ్య పూజకు కూడా సరైన సినిమాలు లేవు. మోనికా సాంగ్ తో తెగ వైరల్ అవుతోంది. త్వరలో స్వారీ పట్టాలెక్కనుంది..