Kolkata: ఇండియాలో ఆరుకు చేరిన hmpv కేసులు..

Kolkata: హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV) అనే కొత్త వైరస్ చైనాలో మొదలైంది మరియు ప్రపంచాన్ని కలవరపెడుతోంది. చైనాలో ఈ వైరస్ తీవ్రంగా వ్యాపించిందని తెలుస్తోంది, దీనితో సమీప దేశాలు ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించాయి.

భారతదేశంలో ఈ వైరస్ కేసుల సంఖ్య 6కి చేరింది. ఈ ఒక్కరోజులోనే ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. కొంతకాలం క్రితం, బెంగళూరులో 3 నెలల, 8 నెలల చిన్నారులకు ఈ వైరస్ నిర్ధారణ అయింది. తాజాగా, కోల్‌కతాలో 5 నెలల చిన్నారి కూడా వైరస్ పాజిటివ్‌గా తేలింది. అలాగే, చెన్నైలో మరొకరికి, ఇంకో చిన్నారికి ఈ వైరస్ సోకినట్లు తెలుస్తోంది.

ఇక, అహ్మదాబాద్ లో కూడా రెండు నెలల బాలుడికి ఈ వైరస్ సోకినట్లు తేలింది. బెంగళూరులో 3 నెలల చిన్నారి వైరస్ నుండి కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయింది. మరొక చిన్నారి చికిత్స పొందుతున్నాడు.

ఈ కొత్త కేసులను ఇంకా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించాల్సిఉంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hydra Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హైకోర్టు నోటీసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *