Fatigue: కొంతమంది నిరంతరం అలసటతో బాధపడుతుంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు. అయితే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా శరీరానికి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వవచ్చు. ఆరోగ్య నిపుణులు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, అలసటను తగ్గించడానికి కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. వాటిని ఫాలో అయితే చాలా అలసట అనేదే ఉండదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉదయం అల్పాహారంగా అరటిపండు, చిక్‌పీస్‌తో ఒక గ్లాసు పాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అంతేకాకాఉండా రోజూ ఖాళీ కడుపుతో 2 ఖర్జూరాలు, 2 ఎండు ద్రాక్షలు, 3 బాదం తినాలి. ప్రతి రాత్రి కనీసం 7 గంటలు నిద్రపోవడం మర్చిపోవద్దు. వారానికి మూడు సార్లు మధ్యాహ్నం గూస్బెర్రీ, ఆపిల్, క్యారెట్ జ్యూస్ తీసుకోవాలి. రోజువారీ భోజనంలో మొక్కజొన్న, జొన్న, ఓట్స్ లేదా రాగులు వంటివి ఏదో ఒకటి చేర్చుకోవాలి. అంతేకాకుండా వీలైనంత వరకు ఒత్తిడిని తగ్గించుకోవాలి.
Also Read: Banana Benefits: సమ్మర్‌లో ప్రతిరోజూ 2 అరటిపండ్లు తింటే.. ఎన్ని లాభాలో తెలుసా ?
Fatigue: కొన్ని అధ్యయనాల ప్రకారం.. తేలికపాటి విటమిన్ డి లోపాన్ని సరిచేయడానికి 8 నుంచి 12 వారాలు (56-96 రోజులు) పట్టవచ్చు. అదే సమయంలో, తీవ్రమైన లోపాలను తొలగించడానికి చాలా నెలలు పట్టే అవకాశం ఉంది.. విటమిన్ డి స్థాయిలను తనిఖీ చేయడానికి వైద్యులు రక్తాన్ని పరీక్షించవచ్చు. మీరు విటమిన్ డి లోపంతో బాధపడుతుంటే, వైద్యుడిని సంప్రదించండి. వారు మీకు తగిన చికిత్సా ప్రణాళికను రూపొందిస్తారు.