Jani Master: చట్టపరమైన సమస్యలతో కొంతకాలం వెనుకబడిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, తనదైన శైలితో మళ్లీ సినీ పరిశ్రమలో సందడి చేస్తున్నారు. రవితేజ, శ్రీలీల నటిస్తున్న ‘మాస్ జాతర’ సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన ఓ హై-ఎనర్జీ సాంగ్ షూటింగ్ పూర్తయింది. ఈ పాటలో శ్రీలీల డ్యాన్స్ ఎనర్జీ, ఎక్స్‌ప్రెషన్స్‌కు జానీ మాస్టర్ ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో ఈ పాట గురించి షేర్ చేసిన పోస్ట్‌లో శ్రీలీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శ్రీలీల కూడా జానీకి ఫ్లవర్ బొకే పంపి, ఆప్యాయత చాటుకున్నారు. ఈ గిఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రంగురంగుల సెట్‌లో, మాస్ వాతావరణంలో తెరకెక్కిన ఈ పాట, ప్రేక్షకులను థియేటర్లలో ఉర్రూతలూగించనుంది. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న విడుదల కానున్న ఈ చిత్రం, జానీ మాస్టర్ కెరీర్‌లో కీలక మైలురాయిగా నిలవనుంది. మరి జానీ ఈసారి ఎలాంటి హిట్ స్టెప్స్ అందిస్తారో చూడాలి.
View this post on Instagram