Ali: సినీ నటుడు అలీ ఓ అక్రమ నిర్మాణాల విషయంలో ఇరుక్కున్నారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రంలోని ఓ పంచాయతీ కార్యదర్శి ఆయనకు నోటీసులు ఇచ్చారు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎక్మామిడి పంచాయతీ పరిధిలోని తన ఫామ్‌హౌజ్‌లో అలీ కొన్ని నిర్మాణాలు చేపట్టారు. అయితే ఆ నిర్మాణాలు అక్రమంటూ ఎక్మామిడి పంచాయతీ కార్యదర్శి అలీకి నోటీసులు జారీ చేశారు. దీనిపై అలీ స్పందించాల్సి ఉన్నది. మరి ఆ నిర్మాణాలను కూల్చేస్తారా? లేక అనుమతి పొందుతారా? అన్నది తేలాల్సి ఉన్నది.
