amit shah

Amit Shah: గుజరాత్ లో అతిపెద్ద ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్‌

Amit Shah: గుజరాత్‌లోని అతిపెద్ద ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్‌ను నవంబర్ 1న హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ ప్లాంట్‌తో నగరంలోని వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంట్ పూర్తిగా పని చేస్తే, రోజుకు 4000 మెట్రిక్ టన్నుల సిటీ వేస్ట్ ను  ప్రాసెస్ చేస్తుంది. దాదాపు 350 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది.

దేశవ్యాప్తంగా నగరాల నుండి ప్రతిరోజూ 1.5 లక్షల టన్నులకు పైగా ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి.  వీటిలో 25-28 శాతం మాత్రమే ప్రాసెస్ అవుతున్నాయి. మిగిలిన వ్యర్థాలను బహిరంగ ప్రదేశంలో పడవేయడం లేదా  కాల్చి వేయడం చేస్తున్నారు. 2030 సంవత్సరం నాటికి ఈ వ్యర్థాల పరిమాణం 16 కోట్ల టన్నులకు పెరుగుతుందని అంచనా.

ఇది కూడా చదవండి: Congress: ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ విమర్శలు

ఈ భారీ మొత్తంలో వ్యర్థాలను ఎదుర్కోవడానికి, విధాన రూపకర్తలు వ్యర్థాల  నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే మార్గాన్ని కనుగొన్నారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌లో కాల్చడం ద్వారా ఈ ప్రాసెస్ జరుగుతుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నవంబర్ 1న హోంమంత్రి అమిత్ షా దీన్ని ప్రారంభించారు. వేస్ట్ ను ఎనర్జీగా మార్చే ఈ ప్లాంట్ గుజరాత్‌లో అతిపెద్ద ప్లాంట్ గా చెబుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  uttarakhand:బ‌ద్రీనాథ్‌, కేదార్‌నాథ్ ఆల‌యాల మూసివేత అప్పుడే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *