Viral News: పెళ్లికి సిద్ధమైన తర్వాత మొదటిగా స్నేహితులకు , బంధువులకు వెడ్డింగ్ కార్డు ఇచ్చి పెళ్లికి ఆహ్వానిస్తారు. అయితే ఇప్పుడు ఓ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఇది నాటింటిలో తీవ్ర చర్చనీయాంశమైంది. అంతెందుకు ఈ ఇన్విటేషన్ కార్డ్ వైరల్ కావడానికి ప్రధాన కారణం వెడ్డింగ్ కార్డ్ డిజైన్ కాదు, అందులో రాసిన వున్నా లైన్.
Viral News: ఉత్తరప్రదేశ్‌లోని ఇటా జిల్లా బిచ్‌పురి గ్రామానికి చెందిన రోహిత్, రజనీ అనే జంట వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆహ్వానపత్రికలో కళ్యాణ మండపం, మూహూర్త సమయంతోపాటు ‘సౌరభ్’ అనే వ్యక్తి పేరు రాసి ఉంది. పేరు మాత్రమే కాదు, పెళ్లికి కూడా రాకూడదని షరతు పెట్టారు. పెళ్లి రోజు హాలు చుట్టూ పాకాల ఎక్కడైనా కనిపిస్తే ఆతన్ని తరిమి కొట్టండి అని కూడా రాసి ఉంది.
ఇది కూడా చదవండి: panchaali vivah: ఈ ఆచారం విన్నారా? అక్కడ భర్త తమ్ముడిని కూడా పెళ్లి చేసుకోవాల్సిందే!!
Viral News: ప్రస్తుతం ఈ ఆహ్వాన లేఖ సోషల్ మీడియాలో పెను చర్చకు దారితీసింది. దీనికి సంబంధించి పలు మీమ్స్ సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ‘సౌరభ్’ అనే పలువురు సోషల్ మీడియా యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది నెటిజన్లు “బహుశా” అతను సౌరభ్ మాజీ ప్రియురాలిని పెళ్లి చేసుకుంటున్నాడు” అని రాశారు.