Health Tips: బొప్పాయి పండు మనకు చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ పండును ఫ్రూట్ ఆఫ్ ది ఏంజెల్స్‌గా పిలుస్తారు. బొప్పాయి పండు ఎంతో రుచిగా ఉంటుందో.. మనకు కావల్సిన అనేక పోషకాలను అందిస్తుంది. మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఎ లభిస్తుంది. దీనితోపాటు బి1, బి2, బి3, సి-విటమిన్లు, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా లభిస్తాయి. బొప్పాయి పండు వలన ఇతర ఉపయోగాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయిలోని తెల్లని గుజ్జుని మొహనికి రాయడంవల్ల మంచి మెరుపు వస్తుంది. మొటిమలూ తగ్గుతాయి.
బొప్పాయి ఫేస్‌ప్యాక్ జిడ్డుచర్మానికి ఎంతో మంచిది. అందుకే సబ్బులు, క్రీముల్లో కూడా ఎక్కువగా వాడుతున్నారు.
ఆస్తమా, కీళ్లవ్యాధుల వంటివి రాకుండా నిరోధిస్తుంది.
మలబద్ధకానికి బొప్పాయి పండు మంచి మందు.
ఆకలిని పుట్టించి నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది.
బొప్పాయిపండులోని పీచు మొలల్నీ రానివ్వదు.
బొప్పాయిపండు తినడంవల్ల జలుబు, ఫ్లూ, చెవినొప్పి… వంటివీ తగ్గుతాయి.
బొప్పాయిపండు తామర వ్యాధిని తగ్గిస్తుంది.
పచ్చికాయ అధిక రక్తపోటుని (హై బీపీ) నియంత్రిస్తుంది.
గింజల్లో యాంటీఇన్‌ఫ్లమేటరీ, యాంథెల్‌మింటిక్ గుణాలు మెండు. అందుకే కడుపునొప్పికీ ఫంగల్ ఇన్ఫెక్షన్లకీ వీటిని మందుగా వాడతారు.
కొన్నిచోట్ల ఆకుల రసాన్ని హృద్రోగాలకు ఔషదంగా ఉపయోగిస్తారు.
బొప్పాయి ఆకుల రసాన్ని డెంగ్యూ జ్వరము వచ్చినపుడు వాడితే ప్లేట్లెట్లు కౌంటు పెరగడానికి పనిచేస్తుంది.
డయాబెటిస్ కారణంగా వచ్చే హృద్రోగాల్ని పచ్చి బొప్పాయి తగ్గిస్తుంది.
బొప్పాయిలోని పపైన్‌ను మాత్రగా రూపొందించి జీర్ణసంబంధ సమస్యలకు మందుగా వాడుతున్నారు.
ఈ పపైన్ గాయాల్ని మాన్పుతుంది. ఎలర్జీల్ని తగ్గిస్తుంది. అందుకే గాయాలమీదా పుండ్లపైనా బొప్పాయి పండు గుజ్జుని ఉంచి కట్టుకడితే అవి త్వరగా తగ్గిపోతాయి.
పులియబెట్టిన బొప్పాయి నుంచి పపైన్ ఆయింట్‌మెంట్ తయారుచేస్తారు.
నొప్పి నివారిణిగానూ ( పెయిన్‌కిల్లర్) పపైన్ గొప్పదే. అందుకే నరాలమీద ఒత్తిడిని తగ్గించేందుకూ వెన్నుపూసలు జారినప్పుడూ దీన్ని ఇంజెక్ట్ చేస్తారు.
బొప్పాయి హెమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది.
జాగ్రత్తలు
బొప్పాయి పాలు దురదకు కారణమవుతాయి. అందుకే పచ్చి బొప్పాయి కోసేటప్పుడు ఒంటికి తగలనివ్వకూడదు.
పండు, గింజలు, ఆకులు, పాలల్లో కారైశ్బన్ అనే యాంథెల్‌మింటిక్ ఆల్కలాయిడ్ ఉంటుంది.ఇది ఎక్కువయితే ప్రమాదకరం.
క్యారెట్ మాదిరిగానే బొప్పాయిని ఎక్కువగా తింటే కెరటెనిమియా వ్యాధి వస్తుంది.