Todays Horoscope:
మేషం
ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.
విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి.
వృషభం
ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి.
మిథునం
ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి.ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది.
కర్కాటకం (Todays Horoscope)
విందులు వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
సింహం
వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.
కన్య
అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. నూతన వస్తు, ఆభరణాలు సేకరిస్తారు.
తుల(Todays Horoscope)
ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది.
వృశ్చికం
ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చుచేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.
ధనుస్సు
నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. అనవసర భయాందోళనలకు లోనవుతారు.
మకరం(Todays Horoscope)
చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి.
కుంభం
ప్రయత్నకార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకు వెళ్తారు.
మీనం
ప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబమంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.
గమనిక : రాశిఫలాలు ఆసక్తి కల పాఠకుల సౌకర్యార్ధం అందిస్తున్నాం. ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరుగుతోంది. ఇక్కడ ఇచ్చిన అంశాలపై కచ్చితత్వాన్ని మహాన్యూస్ నిర్ధారించడంలేదు. సంబంధిత విషయాలను ఫాలో అయ్యే ముందు మీ ఆధ్యాత్మిక సలహాదారుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలని మహాన్యూస్ గట్టిగా సూచిస్తోంది.
ఈ ఆర్టికల్స్ కూడా చదవండి :
Badam Benefits: బాదం తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఇవే
Tomato Benifits: అమ్మో.. టొమాటోలతో ఇన్ని ప్రయోజనాలున్నాయా ?