Kiran Abbavaram: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. గురువారం ఆయనకు పండంటి మగ బిడ్డ జన్మించాడు. ఈ శుభవార్తను కిరణ్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నారి పాదాన్ని ముద్దాడుతున్న ఓ భావోద్వేగ ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ భావావేశానికి లోనవుతున్నారు.
కిరణ్ తన భార్య రహస్యతో కలిసి 2024 ఆగస్టు 22న ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ “రాజావారు రాణిగారు” సినిమాలో కలిసి నటిస్తూ ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల ప్రేమను వివాహంగా మార్చుకున్న ఈ జంట ఇప్పుడు తమ తొలి బిడ్డ జననంతో కొత్త జీవనయాత్రను ప్రారంభించారు.
సోషల్ మీడియాలో కిరణ్ పెట్టిన ఫోటోకి లక్షల సంఖ్యలో లైక్స్, కామెంట్లు వస్తున్నాయి. అభిమానులు “జూనియర్ అబ్బవరం”కి స్వాగతం అంటూ కామెంట్లు పెడుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా కిరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: Bhagyashri Borse: టాలీవుడ్ న్యూ టాప్ హీరోయిన్‌గా భాగ్య శ్రీ బోర్స్.. ఆకాశాన్నంటుతోన్న డిమాండ్!
Kiran Abbavaram: ప్రస్తుతం కిరణ్ “కె-ర్యాంప్” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. గత ఏడాది “క” అనే చిత్రంతో మంచి విజయాన్ని సాధించిన కిరణ్, ప్రస్తుతం కెరీర్ పరంగా కూడా మంచి ఊపుమీదున్నాడు.
తండ్రిగా కొత్త బాధ్యతను స్వీకరించిన కిరణ్‌కి అభిమానుల నుంచి అశేషమైన ప్రేమ, ఆశీర్వాదాలు అందుతున్నాయి. ఒక వైపు కెరీర్‌లో విజయం, మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఈ శుభకార్యం – కిరణ్ జీవితంలో ఇది నిజంగా ప్రత్యేకమైన ఘట్టం.
Blessed with a Baby Boy 😇
Happy Hanuman Jayanthi 🙏#Jaisreeram pic.twitter.com/UG5Ztky8gd
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) May 22, 2025