Health Tips: శరీరానికి నీరు చాలా అవసరం, రోజుకు కనీసం 3 లీటర్ల నీరు త్రాగాలి. శరీరంలో నీటిశాతం తగ్గితే డీహైడ్రేషన్ సమస్య తీరుతుంది. ఇది చాలా సమస్యలను కలిగిస్తుంది. అయితే నీరు ఎక్కువగా తాగడం కూడా ప్రమాదమే. ఎందుకంటే హైదరాబాద్‌లో ఓ మహిళ నీరు ఎక్కువగా తాగడం వల్ల ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ ఉదయం నిద్ర లేవగానే 4 లీటర్ల నీళ్లు తాగింది.
Health Tips: ఇలా తాగడం ఆరోగ్యంతో పాటుగా.. చర్మ సౌందర్యం పెరుగుతుందని ఆమె నమ్మి నీరు తాగిన ఒక గంటలోనే ఆమెకు తలనొప్పి, వికారం, వాంతులు వచ్చాయి. కొన్ని నిమిషాల తర్వాత స్పృహ కోల్పోవడం జరిగింది. ఇలా జరగడాన్ని హైపర్ హైడ్రేషన్ అని అంటారు. ఒక వ్యక్తి తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో నీటిని తీసుకుంటే, అది శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు కారణమవుతుంది. ఇది ప్రాణాపాయం కావచ్చు. నీరు శరీరానికి అవసరమైనప్పటికీ, అవసరానికి మించి నీరు త్రాగడం కూడా ప్రమాదకరమని మనం అర్థం చేసుకోవాలి.
ఇది కూడా చదవండి: Shruti Haasan: గోత్ థీమ్ తో శ్రుతీ క్రిస్మస్ సెలబ్రేషన్స్!
Health Tips: రోజుకు దాదాపు 2.5 నుండి 3.5 లీటర్ల నీటిని అంటే ఒకేసారి కాకుండ రోజంతా తాగాలి. రోజువారీ నీటి అవసరాలలో దాదాపు 20 శాతం ఆహారం (ముఖ్యంగా పండ్లు), ఇతర పానీయాల (పాలు, టీ, రసం మొదలైనవి) నుండి కూడా వస్తుంది. ఆరోగ్యకరమైన కిడ్నీలు అదనపు నీటిని తీసుకోవడాన్ని తట్టుకోగలిగినప్పటికీ, గరిష్ట పరిమితి ఉంది. గంటకు 1.5 లీటర్ల కంటే ఎక్కువ లేదా అంతకంటే ఎక్కువ నీటిని తీసుకోవడం వల్ల నీటి మత్తు ఏర్పడుతుంది.