Cinema Theatres

Cinema Theatres: జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్

Cinema Theatres: తెలుగు రాష్ట్రాల మూవీ ఎగ్జిబిటర్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశమై సంచలన నిర్ణయం తీసుకున్నారు. 65 మంది ఎగ్జిబిటర్లు హాజరైన ఈ సమావేశంలో, అద్దె ప్రాతిపదికన సినిమాల ప్రదర్శన వల్ల భారీ నష్టాలు వస్తున్నాయని వెల్లడించారు. ఈ విధానం కొనసాగించలేమని స్పష్టం చేసిన వారు, ఇకపై సినిమాలను షేర్ బేసిస్‌లోనే ప్రదర్శిస్తామని తేల్చిచెప్పారు. ఈ నిర్ణయాన్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్, గిల్డ్‌లకు తెలియజేయనున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది.

Also Read: Anasuya: గృహప్రవేశం వేళ హనుమంతుడు మా ఇంటికి వచ్చాడు.. అనసూయ భావోద్వేగ పోస్ట్

Cinema Theatres: ప్రొడ్యూసర్లు సహకరించకపోతే, జూన్ 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించారు. ఈ నిర్ణయం సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. జూన్‌లో రిలీజ్ కానున్న చిత్రాల భవిష్యత్తు అనిశ్చితంలో పడింది. సినీ అభిమానులు, నిర్మాతలు ఈ బంద్ పిలుపుతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం లభిస్తేనే థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pushpa 3: ‘పుష్ప3’కి లీడ్ ఇవ్వనున్న మరో స్టార్!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *