Pushpa 3: ‘పుష్ప2’ యావత్ తెలుగు ప్రేక్షకులే కాదు… ఇండియన్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్న చిత్రమిది. ఈ సినిమాపై క్రేజ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు మరో కిక్ ఇచ్చే న్యూస్ బయటకు వచ్చింది. ‘పుష్ప2’ క్లయిమాక్స్ లో ‘పుష్ప3’కి లీడ్ ఇస్తూ మరో స్టార్ హీరో ఎంట్రీ ఉంటుందట. అయితే ఆ హీరో ఎవరన్నది త్వరలోనే రివీల్ చేయబోతున్నారు. ఒక్కటి మాత్రం నిజం గూజ్ బంప్స్ వచ్చేలా ఆ హీరో వాయిస్ ఉంటుందట. యాక్షన్ ని పీక్స్ లో ఉండేలా చిత్రీకరించే సుకుమార్ ఈ ఎపిపోడ్ ను వాహ్ అనిపించేలా తీయబోతున్నాడట. ‘పుష్ప3’పై అంచనాలు పెంచేలా ఈ ఎపిసోడ్ ఉంటుందంటున్నారు యూనిట్ సభ్యులు. ఇదిలా ఉంటే నవంబర్ 4వ తేదీనుంచి ఐటమ్ పాటను చిత్రీకరించనున్నారు. ఐదు రోజుల పాటు ఈ పాట చిత్రీకరణ జరగనుంది. ఆ తర్వాత ‘పుష్ప3’ లీడ్ సీన్స్ ను పిక్చరైజ్ చేస్తారట. ఆ హీరో ఎవరు? ఐటమ్ సాంగ్ చేస్తోంది ఎవరు? వంటి విషయాలను యూనిట్ త్వరలోనే రివీల్ చేయనుంది.
ఇది కూడా చదవండి: Ramcharan: మెగా అభిమానులకు దీపావళి కానుక.. మిట్టమధ్యాహ్నం టపాసుల వర్షం!