satyam sundaram

satyam sundaram: 25 నుంచి ఓటీటీలో ‘సత్యం సుందరం’!?

satyam sundaram: కార్తీ, అరవింద్ స్వామి నటించిన ‘సత్యం సుందరం’ సినిమా విమర్శకులు ప్రశంసలతో పాటు ఆడియన్స్ మెప్పుకూడా పొందింది. ‘మెయ్యళగన్’ పేరుతో తమిళంలో రిలీజ్ అయిన ఈ చిత్రం చక్కటి విజయాన్ని సాధించి మొత్తం 52 కోట్లు వసూలు చేసింది. ‘96’ ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ విలేజ్ ఫ్యామిలీ సెంటిమెంటల్ ఎంటర్ ట్రైనర్ చిత్రం ఈ నెల 25 నుంచి ఓటీటీలో రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అన్ని భాషల్లోనూ ‌స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వాళ్శు చూసేయవచ్చు. ఈ సినిమాను సూర్య, జ్యోతిక తమ 2డి ఎంటర్ టైన్ మెంట్ పతాకం పై నిర్మించటం విశేషం. గోవింద్ వసంత్ సంగీతం అందించిన ఈ చిత్రంలో తెలుగమ్మాయి శ్రీదివ్య కథానాయికగా నటించింది. ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ దక్కుతుందో మరి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  P Ravichandran: ప్రముఖ గాయకుడు పి. జయచంద్రన్ కన్నుమూత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *