P Ravichandran: 1980లలో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సూపర్ హిట్ సాంగ్ ను పాడిన పి. జయచంద్రన్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జనవరి 9వ తేదీ రాత్రి తుదిశ్వాస విడిచారు. జయచంద్రన్ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో పదహారు వేలకు పైగా పాటలు పాడారని సన్నిహితులు చెబుతున్నారు. మలయాళ చిత్రం ‘శ్రీ నారాయణగురు’ చిత్రానికి గానూ జయచంద్రన్ ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. తెలుగులోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఆయన పాటలు పాడారు. పుట్టిన రోజు వేడుకల్లో తెలుగువాళ్ళ ‘సుస్వాగతం’ మూవీలోని హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు సాంగ్ ప్లే చేయకుండా ఉండరు. ఆ పాటను పాడింది జయచంద్రనే!