Ponguleti srinivas: 20 లక్షల ఇండ్లు నిర్మిస్తం..

Ponguleti srinivas: ఐదేళ్లలో 20 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. హనుమకొండలో ఆర్టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో పేద పిల్లలకు సరైన భోజనం అందించలేని పరిస్థితి నెలకొన్నట్లు ఆరోపించారు. అందుకే తాము మెస్ ఛార్జీలను 200 శాతం పెంచి పేద విద్యార్థులకు మద్దతు అందించామన్నారు. గత ప్రభుత్వాలు ఆర్టీసీ కార్మికులను విస్మరించాయని, కానీ తమ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటుందని స్పష్టం చేశారు.

రైతుల అంశంపై మాట్లాడుతూ, “వరి వేస్తే ఉరే” అన్న నాటి సీఎంకు విరుద్ధంగా తమ ప్రభుత్వం రైతులను రాజుగా మార్చిందని తెలిపారు. రాబోయే సంక్రాంతి నాటికి 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. గతంలో పింక్ కలర్ షర్ట్ వేసుకున్నవారికే ఇళ్లు ఇచ్చారని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం పార్టీ, కులం, మతాలకతీతంగా పేదలకు ఇళ్లు అందజేస్తుందని తెలిపారు.

ధరణి వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేశామని, గత ప్రభుత్వాలు అప్పుచేసి దోచుకున్నప్పటికీ తాము ఇప్పుడు రూ.6500 కోట్ల ఈఎంఐ చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు అచ్చొచ్చిన ఆంబోతులా ప్రవర్తించారని విమర్శించారు. కేసీఆర్ అసెంబ్లీలోకి రాకుండా కుర్ర ఆంబోతులను పంపిస్తున్నారని ఆరోపించారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం డోర్ క్లోజ్ అవుతుందని, రైతుల ప్రతి గుంటకు రైతు భరోసా అందిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  TTD: శ్రీవారి ఆలయం ముందు రీల్స్‌ చేస్తే కఠిన చర్యలు.. టిటిడి హెచ్చరిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *