Kubera

Kubera: పెరిగిన ‘కుబేర’ మూవీ బడ్జెట్!

Kubera: తమిళ సినిమాలలో నటిస్తున్నప్పుడు కాస్తంత చూసి రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరో ధనుష్ పరభాషల్లో నటిస్తున్నప్పుడు మాత్రం భారీ పారితోషికాన్నే వసులూ చేస్తున్నాడు. హిందీ, తెలుగు సినిమాల నిర్మాతలు ఈ విషయంలో రాజీ పడకతప్పడం లేదు. గత యేడాది ధనుష్ నటించిన తెలుగు సినిమా ‘సార్’ విడుదలై చక్కని విజయం సాధించింది. దాంతో ఆయన ‘కుబేర’ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో రష్మికా మందణ్ణ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటున్న ఈ సినిమాను శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్నారు. ‘కుబేర’ మూవీకి 90 కోట్ల బడ్జెట్ అనుకున్నా, నిర్మాతలకు ఇప్పుడు అదనంగా మరో 30 కోట్లు ఖర్చు అయ్యిందట. మొదటి నుండి శేఖర్ కమ్ములకు బడ్జెట్ విషయంలో అదుపు ఉండదనే విమర్శ ఉంది. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగిందని అంటున్నారు. అయితే పుస్కర్ రామ్మోహన్, సునీల్ నారంగ్ తో పాటు శేఖర్ కమ్ముల సైతం ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. వచ్చే యేడాది జనం ముందుకు రాబోతున్న ‘కుబేర’ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Akkineni Nagarjuna: ప్ర‌ధాని మోదీని క‌లిసిన నాగార్జున కుటుంబం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *