Learn Languages: ప్రస్తుతం అంతా గ్లోబలైజేషన్. మన మాతృ భాష కాకుండా కనీసం రెండు, మూడు భాషల్లో పట్టు ఉంటే ఉద్యోగాల్లో మరింత పెరుగుదల ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేసేవారికి వివిధ భాషలలో మాట్లాడాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. భాష నేర్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. 30 రోజుల్లో ఎదో భాష పుస్తకం కొనేసి నేర్చేసుకుందాం అంటే అది కూడా అంత వీజీ కాదు. అయితే, భాషలు తొందరగా నేచుకోవాలంటే ఒక టెక్నీక్ ఉందట. అంటే, టెక్నీక్ కాదనుకోండి.. ఒక లైఫ్ స్టైల్ ఛేంజ్ అని చెప్పవచ్చు. అవును.. వివిధ భాషలు తొందరగా మనకు వంటపట్టాలంటే రోజుకు కనీసం 8 గంటల పాటు కచ్చితంగా నిద్రపోవాలని చెబుతున్నారు. ఈ మేరకు జరిగిన పరిశోధనలలో ఈ విషయం స్పష్టమైంది.
Learn Languages: అంటే బాగా నిద్రపోండి. భాషలు నేర్చుకోండి అని చెప్పవచ్చు. రోజుకి ఎనిమిది గంటలపాటు నిద్రపోతే కొత్త భాషలు తొందరగా తాజా పరిశోధనల్లో నేర్చుకుంటామని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా తేలింది. ఇందుకోసం 35 మందిని ఎంచుకుని వాళ్లను ‘మినీ పిన్న్’ అనే మినియేచర్ భాషను నేర్చుకోమన్నారు. అయితే, అందులో సగం మందిని ఉదయాన్నే చదవమని, సాయంత్రం జ్ఞాపకశక్తిని పరీక్షించారు. మిగతా సగం మందిని సాయంత్రం చదవమని, ఆ రాత్రంతా ల్యాబ్లోనే నిద్రపొమ్మని చెప్పారు. ఆ సమయంలో బ్రెయిన్ పనితీరుని రికార్డు చేశారు.
ఇది కూడా చదవండి: Neem Leaves: చేదుగా ఉన్నప్పటికీ వేపకులను తినండి.. గుండె భద్రం
Learn Languages: మరుసటి రోజు ఉదయాన్నే పరీక్షించారు. ఆ తరవాత రెండు గ్రూపులనూ పోల్చిచూస్తే నిద్రపోయినవాళ్లు నిద్రలేనివాళ్లకంటే బాగా గుర్తుంచుకున్నారట. నిద్రపోయే సమయంలోనే సమాచారం మన మెదడులో హిప్పోక్యాంపస్ నుంచి కార్టెక్స్ భాగానికి వెళ్లి ఎక్కువకాలం గుర్తుంటుందట. అంతేకాదు, భాషలో సమస్యలు, ఆటిజం, అపేజీయా వంటివి ఉన్నవాళ్లకు స్పీచ్ థెరపీ ఇవ్వడానికీ ఈ పరిశోధనలు ఉపయోగపడతాయంటున్నారు శాస్త్రవేత్తలు.
సో.. కొత్త భాషలు.. విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా రోజుకు 8 గంటలపాటు మంచి నిద్రపోవడం తప్పనిసరి.