ADR Analysis: ఎన్నికల సంస్కరణలపై పనిచేస్తున్న ఎన్జీఓ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక ప్రకారం దేశంలోని 45% మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 28 రాష్ట్రాలు, శాసనసభలు ఉన్న మూడు కేంద్రపాలిత ప్రాంతాల నుండి మొత్తం 4123 మంది ఎమ్మెల్యేలలో 4092 మంది ఎన్నికల అఫిడవిట్లను ADR విశ్లేషించింది.
174 మంది ఎమ్మెల్యేలలో ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 138 మంది (79%) పై క్రిమినల్ కేసులు ఉండగా, సిక్కింలో అత్యల్పంగా 32 మంది ఎమ్మెల్యేలు (3%) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ (టిడిపి)కి చెందిన 134 మంది ఎమ్మెల్యేలలో 115 (86%) మందిపై అత్యధిక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
1861 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని నివేదిక వెల్లడించింది. వీరిలో 1,205 మందిపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. స్కానింగ్ సరిగా లేకపోవడం వల్ల 24 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను విశ్లేషించలేకపోయారు. అసెంబ్లీలలో ఏడు సీట్లు ఖాళీగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Tragedy: ప్రేమించాలి అంటూ యువకుడి వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న 10వ తరగతి విద్యార్థిని
127 మంది ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాల కేసులు
నివేదిక ప్రకారం, 54 మంది ఎమ్మెల్యేలపై భారత శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 302 కింద హత్య ఆరోపణలు ఉన్నాయి. కాగా, 226 మందిపై ఐపీసీ సెక్షన్ 307 -ఇండియన్ పీనల్ కోడ్ (బిఎన్ఎస్) సెక్షన్ 109 కింద హత్యాయత్నం అభియోగాలు మోపారు.
ఇది కాకుండా, 127 మంది ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాల కేసులు నమోదయ్యాయి. వీరిలో 13 మందిపై ఐపీసీ సెక్షన్లు 376- 376 (2)(n) కింద అత్యాచారం అభియోగాలు ఉన్నాయి. సెక్షన్ 376(2)(n) ఒకే బాధితురాలిపై పదే పదే లైంగిక వేధింపులకు సంబంధించినది.