Nikhil Sosale

Nikhil Sosale: RCB మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోషల్ ఎవరు?

Nikhil Sosale: చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట సంఘటనలో 11 మంది అభిమానులు మరణించగా, దాదాపు 50 మంది గాయపడ్డారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ విషాదం జరిగిన వెంటనే పోలీసులు కొంతమందిని అరెస్టు చేశారు. ఆశ్చర్యకరంగా, RCB మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు RCB నిర్వాహకుల నిర్లక్ష్యం కారణమని ఆరోపణలు వస్తున్నాయి. RCB మార్కెటింగ్ రెవెన్యూ హెడ్ నిఖిల్ సోసలే ముంబైకి విమానంలో వెళుతుండగా బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి: Virat Kohli IPL Salary: ఐపీఎల్ లో కోహ్లీ సంపాదన ఎంత?

ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతి లేకుండా, RCB కోసం అనధికార మార్కెటింగ్ ఈవెంట్‌లను నిర్వహించడం, పెద్ద సంఖ్యలో జనాన్ని సమీకరించడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ సంఘటనకు సంబంధించి DNA ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి చెందిన ముగ్గురు సభ్యులను కూడా అరెస్టు చేశారు. అయితే, 11 మంది మరణాలకు ప్రత్యక్షంగా కారణమైన విలన్ ఎవరు అనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. నిఖిల్ సోసలే డియాజియో ఇండియాలో ఉద్యోగి, దీనిని మొదట యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (USL) నిర్వహిస్తోంది. బెంగళూరులో నివసించే సోసలే గత 13 సంవత్సరాలుగా డియాజియోలో ఉన్నారు. RCB ఫ్రాంచైజీతో చాలా దగ్గరగా పనిచేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  IPL: చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ - టాస్ అప్డేట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *