kodumur: రాయలసీమ గేట్ ఆఫ్‌గా చెప్పుకునే ఉమ్మడి కర్నూల్ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఎస్సీ నియోజకవర్గాలుగా కోడుమూరు, నందికొట్కూరు ఉన్నాయి. అయితే కోడుమూరు ఎస్సీ నియోజకవర్గంగా 1962లో ఏర్పడింది. అప్పటి నుంచి కాంగ్రెస్‌కి కంచుకోటగా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఇతర పార్టీల నుంచి ఎన్నికల్లో ఎవరు పోటీ చేసిన కాంగ్రెస్ జెండానే రెపరెపలాడేది. అలాంటి కంచుకోటలో టీడీపీ జెండాను ఎగరవేసింది. మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీకి చెందిన బొగ్గుల దస్తగిరిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంది. వైసీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను మట్టి కరిపించింది. తొలిసారిగా ఎమ్మెల్యేగా బొగ్గుల దస్తగిరిని అసెంబ్లీకి పరిచయం చేయించింది. వైసీపీ వ్యూహలను తిప్పి కొట్టి టీడీపీ జెండాను పాతింది. 1985లో ఒక్కసారి మాత్రమే ఎగిరిన టీడీపీ జెండాను మళ్లీ 2024లో రెపరెపలాడింది.
1962 నుంచి 1967 వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య మొదటి ఎమ్మెల్యేగా నిలిచిపోయారు. ఆ తరవాత 1972 నుంచి 1983 వరకు కూడా కాంగ్రెస్‌కి చెందినవారే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఆవిర్భావించడంతో కోడుమూరు సెగ్మెంట్‌లో పార్టీకి చెందిన శిఖామణి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరవాత 1989లో జరిగిన ఎన్నికల నుంచి 2009 వరకు కూడా కాంగ్రెస్‌కి చెందిన వారే ఎమ్మెల్యేలు అయ్యారు. ప్రతి ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రజలు ఆదరించలేదు. ఒకే పార్టీని జెండాను రెపరెపలాడించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగిన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో కోడుమూరు ప్రజలు ఫ్యాన్ పార్టీని ఆదరించారు.
ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి కూడా టీడీపీకి ఓటమి తప్పలేదు. దీంతో కోడుమూరులో టీడీపీ జెండాను ఎగర వెయ్యాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియోజకవర్గ నాయకులను ఆదేశించారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిని కాకుండా కొత్త అభ్యర్థి రాజకీయలకు సంబంధం లేని బొగ్గుల దస్తగిరిని పోటీలోకి దింపారు.
నియోజకవర్గ నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి దాదాపుగా 40 ఏళ్ల తర్వాత కోడుమూరులో టీడీపీ జెండాను రెపరెపలాడించారు.
నియోజకవర్గ ప్రజలు కూడా టీడీపీపై నమ్మకంతో ఆదరించారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై అవగాహన కలిగిన నాయకుడు, నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులంతా కసిగా పనిచేసి రికార్డును బ్రేక్ చేశారు. ఎమ్మెల్యేగా బొగ్గుల దస్తగిరి గెలుపొందిన తర్వాత నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. నియోజకవర్గంలో ఉన్న సి.బెళగల్, గూడూరు, కర్నూలు రూరల్, కోడుమూరు పట్టణాలలో నెలకొన్న తాగునీటి సమస్యలను పరిష్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లకు మరమ్మత్తులు చేస్తున్న విషయం తెలిసిందే పట్టణాలకు కనిటివిటీగా ఉండాలని ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా రోడ్లకు మరమ్మతులు చేయించారు.
ఇలా నియోజకవర్గంలో ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కృషి చేస్తున్నారు.
మొత్తానికి నియోజకవర్గ రూపురేఖలను మార్చేందుకే ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కంకణం కట్టుకున్నారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఏది ఏమైనాప్పటికీ దాదాపుగా 40 ఏళ్ల తర్వాత కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేయడంతో పార్టీ బలోపేతం చేసేందుకు నాయకులంతా కూడా కృషి చేస్తున్నారు నియోజకవర్గ ప్రజల ఆధారాభిమానాలు ఇలాగే ఉండాలని ఉద్దేశంతో కసిగా పని చేస్తున్నారు.
రాసినవారు: ఖలీల్
సీనియర్ కరస్పాండెంట్
కర్నూలు జిల్లా

