Sankranthiki Vasthunnam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో వెంకటేశ్, అనిల్ రావిపూడి, శిరీష్ కలిసి 72 రోజుల్లో పూర్తి చేశారని నిర్మాత దిల్ రాజు అన్నారు. సినిమా పట్ల తనకు, శిరీష్ కు పేషన్ కలిగింది నిజామాబాద్ లోనే అని అన్నారు. వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఈ నెల 14న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిజామాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించారు. తన గత చిత్రాలను ఆదరించినట్టుగానే దీనిని ఆదరించాలని, ఈ సినిమాతోనే వస్తున్న ‘గేమ్ ఛేంజర్, డాకు మహరాజ్’ చిత్రాలూ విజయవంతం కావాలని కోరుకుంటున్నానని వెంకటేశ్ అన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే ఆశాభావాన్ని దర్శక నిర్మాతలు అనిల్ రావిపూడి, శిరీష్ వ్యక్తం చేశారు. హీరోయిన్లు ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాస్తంత ముందు మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ లాంచ్ చేశారు.