Weight Loss Tips: పండ్లు మన శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలను అందిస్తాయి. కాబట్టి ప్రతిరోజూ పండ్లు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రోజుకు కనీసం ఐదు పండ్లను తినే వారికి గుండె జబ్బులు, పక్షవాతం వంటి కొన్ని ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం తక్కువని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గాలనుకునే వారు పండ్లను ఎక్కువగా తింటారు. అయితే బరువు తగ్గే సమయంలో కొన్ని పండ్లకు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదంటే శరీర బరువు పెరుగుతుందని చెబుతున్నారు. కాబట్టి, బరువు తగ్గేటప్పుడు ఎలాంటి పండ్లు తినకూడదో ఈ పోస్ట్‌లో తెలుసుకుందాం.
అరటిపండు: బరువు తగ్గడానికి, పెరగడానికి అరటిపండు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో కేలరీలు, చక్కెర అధికంగా ఉంటాయి. ఒక అరటిపండులో 37 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 150 కేలరీలు ఉంటాయి. బరువు తగ్గేటప్పుడు రోజుకు 2-3 అరటిపండ్లు తింటే కచ్చితంగా బరువు పెరుగుతారు. కాబట్టి అరటిని తక్కువగా తినాలి.
మామిడి: చాలా మందికి ఇష్టమైన పండ్లలో మామిడి ఒకటి. మామిడి పండ్లలోనూ కేలరీలు, చక్కెర అధికంగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గేవారికి ఈ పండు మంచిది కాదు. 100 గ్రాముల మామిడి పండులో 60గ్రా. కేలరీలు ఉంటాయి. కాబట్టి బరువు తగ్గేవారు మామిడి పండ్లను తింటే బరువు పెరుగుతారు.
దానిమ్మ: శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారికి దానిమ్మ మంచి ఔషధం. మరో మాటలో చెప్పాలంటే ఇది పోషకాల శక్తి. కానీ ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాములకు 83 కేలరీలు ఉంటాయి. కాబట్టి బరువు తగ్గే సమయంలో దీన్ని ఎక్కువగా తినొద్దు.
అవోకాడో: 100 గ్రాముల అవకాడో పండులో 160 కేలరీలు ఉంటాయి. అంతేకాకుండా ఈ పండులో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. కాబట్టి మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే, ఈ పండును ఎక్కువగా తినకూడదని గుర్తుంచుకోండి.
సీతాఫలం: సీతాఫలం తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తుంది. కానీ ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాములకు 94 శాతం కేలరీలు ఉంటాయి. ఇలాంటప్పుడు బరువు తగ్గేవారు ఈ పండును ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు.