Rajeev Khandelwal

Rajeev Khandelwal: ఛత్రపతి శివాజీ వారసత్వంపై వెబ్ సీరీస్!?

Rajeev Khandelwal: ఛత్రపతి శివాజీపై ఇప్పటికే పలు చిత్రాలు, వెబ్ సీరీస్ వచ్చాయి. వాటిలో కొన్ని సక్సెస్ కాగా మరి కొన్ని పరాజయం పాలయ్యాయి. తాజాగా ఆయన వారసత్వంపై ఓ వెబ్ సీరీస్ తెరకెక్కుతోంది. ‘ముంజ్య’ వంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత ఆ చిత్ర దర్శకుడు ఆదిత్య సర్పోత్దార్ ఈ సీరీస్ తీస్తున్నాడు. చత్రపతి తరువాత కథను అందిస్తూనే ట్రెజర్ హంట్ అంశాన్ని టచ్ చేస్తూ ‘ది సీక్రేట్ ఆఫ్ ది షిలేదార్స్’ పేరుతో రూపొందిస్తున్నాడు. శివాజీ మహారాజ్ వారసత్వం మహారాష్ట్రకు మాత్రమే కాకుండా భారతదేశం మొత్తానికి సంబంధించినదని అందుకే దానిని వివరించే కథలో భాగం అయినందుకు సంతోషిస్తున్నానంటున్నాడు ‘ముంజ్యా’ దర్శకుడు. రాజీవ్ ఖండేల్వాల్, సాయి తమంహర్కర్, గౌరవ్ ఆమ్లానీ, ఆశిష్ విద్యార్ధి ముఖ్య పాత్రలు పోషిస్తున్నఈ సీరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 31 నుంచి టెలీకాస్ట్ కానుంది. ఈ సీరీస్ మరాఠాల శౌర్యం, విధేయత, నిబద్ధతను వ్యక్తపరిచేలా ఉంటుందంటున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  MD Sajjanar : తూచ్ అదంతా ఫేక్ .. ఛార్జీల పెంపుపై సజ్జనార్ క్లారిటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *