Ponnala Laxmaiah: ఇటీవల హైదరాబాద్ నగరంలోని ముఖ్య నేతల ఇండ్లనే దొంగలు లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారు జిల్లాల్లో ఉన్న సమయాల్లో నగరంలోని వారిండ్లను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటి నుంచి నిన్న జరిగిన పొన్నాల లక్ష్మయ్య ఇంటిలో చోరీ ఘటన వరకు అదే విషయం తేలింది. హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఇంటిలో నిన్న చోరీ జరిగింది.
ఈ ఘటనలో లక్షన్నర రూపాయల నగదుతోపాటు భారీగా ఆభరణాలు చోరీకి గురైనట్టు తెలిసింది. ఈ మేరకు పొన్నాల లక్ష్మయ్య సతీమణి అరుణాదేవి ఫిల్మ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.