Fake Paneer: పనీర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. పిల్లలతో సహా పెద్దల వరకు అందరు దీన్ని ఇష్టంగా తింటారు. అయితే ప్రస్తుతం నకిలీ పనీర్ మార్కెట్‌ను ముంచెత్తుతోంది. అసలైన పనీర్ ఖరీదైనది కాబట్టి షాపుల్లో రూ.100 నుంచి 200-250కి దొరికే పనీర్ చాలా వరకు నకిలీవే. ఇప్పుడు జొమాటో ‘అనలాగ్ పనీర్’ అని పిలిచే నకిలీ పనీర్ ని రెస్టారెంట్లకు సరఫరా చేస్తుందనే ఆరోపణలను ఎదుర్కొటుంది. ఇక దీన్ని తింటే ప్రాణాపాయం తప్పదని, లేకుంటే ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఇంటికి తెచ్చే పనీర్ నకిలీదా లేక అసలైనదా అని తెలుసుకోవడానికి సులభమైన మార్గాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఇది కూడా చదవండి: Sabarimala: శబరిమలకు పోటెత్తిన భక్తజనం
లేబుల్ చూడాలి :
పన్నీర్ కొనేటప్పుడు ఎల్లప్పుడూ లేబుల్‌లను జాగ్రత్తగా చదవాలి. ప్రామాణికమైన పనీర్ తప్పనిసరిగా పాలు, వెనిగర్ వంటివి మాత్రమే వాడతారు. అనలాగ్ పనీర్‌లో నూనెలు, పిండి పదార్ధాలు వాడతారు.
జొన్న పరీక్ష : పనీర్ ఉడకబెట్టి, కొద్దిగా జొన్న పొడిని కలిపాలి. 10 నిమిషాల తర్వాత నీరు లేత ఎరుపు రంగులోకి మారితే అందులో యూరియా ఉండవచ్చు.
ఉప్పు పరీక్ష: ఉడికిన పనీర్‌పై కొంచెం ఉప్పు వేయాలి. ఇది నీలం రంగులోకి మారితే స్టార్చ్ ఉంటుంది.
ఆకృతి, రుచి
నిజమైన పనీర్ నొక్కినప్పుడు పొడిగా మారి.. పాల వాసన కలిగి ఉంటుంది. అనలాగ్ పనీర్ పుల్లని రుచితో రబ్బరులా ఉంటుంది.
ధర విషయంలో జాగ్రత్త :
నిజమైన పన్నీర్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ధర తక్కువగా ఉందంటే అది అనలాగ్ పనీర్ అని గమనించాలి.
పనీర్ నాణ్యత గురించి ఆందోళన చెందుతున్న వారు ఇంట్లోనే పన్నీర్ తయారుచేసుకోవడం మంచింది. ఇది కేవలం పాలు, నిమ్మరసం లేదా వెనిగర్ వంటి వాటితో తయారు చేసుకోవచ్చు.