Washington Sundar

Washington Sundar: ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా వాషింగ్టన్ సుందర్‌

Washington Sundar: ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కు ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు లభించింది. ఈ అవార్డును టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో జట్టులోని సహచరులు, కోచింగ్ స్టాఫ్ అందించారు. ఈ సిరీస్ లో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా కీలక పాత్ర పోషించి జట్టు విజయంలో తన వంతు సహకారం అందించారు. రవీంద్ర జడేజా ఈ మెడల్ ను సుందర్ కు బహూకరించి అభినందించారు. ఈ సిరీస్ లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు శుభ్ మన్ గిల్,హ్యారీ బ్రూక్ కు లభించింది. అయితే, సుందర్ కు లభించిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అవార్డు అతని ప్రదర్శన ఎంత ప్రభావాన్ని చూపించిందో తెలియజేస్తుంది.

Also Read: India vs England: ఇండియా vs ఇంగ్లాండ్ సిరీస్.. 96 ఏళ్ల ప్రపంచ రికార్డును సమం

ఈ సిరీస్‌లో వాషింగ్టన్ సుందర్‌ తొలి టెస్టులో మినహా అన్ని మ్యాచ్‌ల్లో ఆడాడు. ఇటు బ్యాటింగ్‌లో, అటు బౌలింగ్‌లో భారత్‌కు కీలకంగా మారాడు. ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో కలిపి 47.33 సగటుతో 284 పరుగులు చేశాడు. నాలుగో టెస్టులో జడేజాతో కలిసి సెంచరీ చేసి మ్యాచ్‌ డ్రాగా ముగియడంలో కీలకపాత్ర పోషించాడు. మొత్తం ఏడు వికెట్లు పడగొట్టిన సుందర్‌.. ఇందులో నాలుగు లార్డ్స్‌లో సాధించాడు. ఇంగ్లాండ్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఆడటం చాలా గొప్ప అనుభూతి అని, ఇక్కడ ఎప్పుడూ బాగా రాణించాలని కోరుకుంటానని సుందర్ పేర్కొన్నాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Side Effects Of Coconut Water: వీళ్ళు కొబ్బరి నీళ్లు అస్సలు తాగకూడదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *