Warangal news: ఇటీవల ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ దళిత మహిళపై చేయి చేసుకున్న వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ ఎస్ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తమ ఇద్దరిపై ఎస్ఐ శ్రీకాంత్, మరో కానిస్టేబుల్ రాజు తమపై దాడి చేశారని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహించే దళిత మహిళ సండ్ర మరియమ్మ, ఆమె కుమారుడు శేఖర్ ఫిర్యాదు మేరకు ఎస్ఐపై కేసు నమోదు చేశారు.
Warangal news: వరంగల్ ఫోర్ట్ రోడ్డులో అర్ధరాత్రి అయినా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎందుకు మూయలేదని, ఎస్ఐ శ్రీకాంత్, కానిస్టేబుల్ రాజు గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారని బాధితులు ఆరోపించారు. మూసి ఉన్నా ఎందుకు సిలిండర్ తీసుకెళ్తున్నారని ఆ దళిత మహిళ మరియమ్మ ప్రశ్నించగా, తననే ప్రశ్నిస్తావా అంటూ ఆమెపై ఎస్ఐ చేయి చేసుకుని దుర్భాషలాడారని ఆరోపించారు.
Warangal news: తన తల్లిని ఎందుకు కొట్టారని ఎస్ఐని ప్రశ్నించిన ఆమె కొడుకు శేఖర్ నిలదీయగా, తనను కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు తల్లికొడుకులైన మరియమ్మ, శేఖర్‌లు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ శ్రీకాంత్, కానిస్టేబుల్ రాజుపై ఫిర్యాదు చేశారు. తమను కులం పేరుతో ఎస్ఐ, కానిస్టేబుల్ దూషించారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Warangal news: తల్లికొడుకుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. ఎస్ఐ శ్రీకాంత్, కానిస్టేబుల్ రాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అదే విధంగా ఎస్ఐ శ్రీకాంత్ కూడా ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు మరియమ్మ, ఆమె కుమారుడు శేఖర్‌పైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, చిన్నపాటి రోడ్‌సైడ్ వ్యాపారులపై పోలీసుల దౌర్జన్యం మితిమీరుతుందని, పెద్ద హోటళ్లపై ఇలాంటి దౌర్జన్యాలు చేస్తారా? అని స్థానికులు పోలీసుల వైఖరిపై విస్మయం వ్యక్తంచేస్తున్నారు.