Viral News: కలరా, కరోనా వ్యాధులు వ్యాపించిన సందర్భాల్లో ప్రపంచ మానవాళి అతలాకుతలం అయింది. కోటానుకోట్ల మంది ఈలోకాన్ని విడిచి వెళ్లారు. ఎంతో మంది అర్ధాయుష్షుతో బతుకీడుస్తున్నారు. మరెంతో మంది కరోనా భయానకం నుంచి బయటపడలేదు. గుండె, కిడ్నీ లాంటి వ్యాధులతో బాధపడుతున్నారు. ఇప్పటికీ కరోనా ప్రభావంతో వచ్చిన వ్యాధులు తిరగదోడి బలవుతున్నారు. తాజాగా ఓ విషయం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేసేలా ఉన్నది.
Viral News: బతికి ఉన్న మనుషుల మాంసం తినే పరాన్నజీవిని తాజాగా వైద్యులు గుర్తించారు. గ్వాటెమాల దేశం నుంచి ఇటీవల మేరీల్యాండ్ వచ్చిన ఓ వ్యక్తి శరీరంపై ఈ పరాన్నజీవిని గుర్తించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ పరాన్న జీవి వేడి రక్తం ఉండే జీవుల శరీరంలోకి ప్రవేశించి నివాసం ఏర్పాటు చేసుకుంటుందని వైద్యులు తేల్చి చెప్పారు. ఆ పరాన్న జీవి కట్టడికి తగిన చర్యలు తీసుకుంటున్నట్టు వారు వెల్లడించారు.