Attack On Vikarabad Collector

Attack On Vikarabad Collector: వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై చేయి చేసుకున్న మహిళ

Attack On Vikarabad Collector: వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్పై దాడి జరిగింది. కలెక్టర్ తోపాటు పలువురు అధికారులను రాళ్లతో తరిమికొట్టారు. ఈ ఘటన దుద్యాల మండలంలోని లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీపై అభిప్రాయ సేకరణకు కలెక్టర్ ప్రతిక్ జైన్,కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, పలువురు అధికారులు వెళ్లారు.

ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వాలంటూ రైతులను, గ్రామస్తులను కలెక్టర్, అధికారులు కోరారు. తాము భూములు ఇవ్వమంటూ ఒక్కసారిగా కలెక్టర్, అధికారులపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడి నుంచి వెళ్ళిపోతున్న కలెక్టర్, అధికారుల వాహనాలను వెంబడించి రాళ్లు, కర్రలతో దాడికి యత్నించారు. ఈ దాడిలో అధికారుల పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Discount On Tata Cars: మార్చిలో టాటా మోటార్స్ కార్లపై భారీ డిస్కౌంట్..లక్షల్లో ఆదా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *