kanguva Movie: సూర్య హీరోగా వస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘కంగువ’. శివ దర్శకత్వంలో దిశాపటాని, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది. 14న ప్రపంచ వ్యాప్తంగా రాబోతున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ పై జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. రిలీజ్ ట్రైలర్ లో సినిమా కంటెంట్ మొత్తాన్ని రివీల్ చేశారు. ప్రజెంట్ టైమ్ లో హీరోని స్టైలిష్ గా చూపిస్తూ వెయ్యేళ్ళ క్రితానికి వెళ్ళి అప్పటి నాయకుడు ‘కంగువ’ చేసిన ప్రామిస్, దానిని నిలబెట్టుకోవటానికి ఏం చేశాడు అనేది చూపించారు. వెయ్యేళ్ళ నాటి కంగువ ప్రపంచాన్ని ఆవిష్కరించిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. దేవిశ్రీ సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు ఇప్పటికే మంచి ఆప్లాజ్ వస్తోంది. ఇక ఆయన బీజీఎం ఈ ట్రైలర్ ని హైలైట్ చేసేలా సాగి సినిమాపై అంచనాలను పెంచేసింది. కొద్ది రోజుల్లో ఆడియన్స్ ముందుకు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో రిలీజ్ కాబోతున్ ఈ సినిమాకు ఏలాంటి ఆదరణ లభిస్తుందో మరి.