Vc sajjanar: సూపర్ స్టార్ రజనీకాంత్‌ను తెలంగాణ ఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రశంసలతో ముంచెత్తారు. ఆయనను “నిజమైన సూపర్ స్టార్” అని కొనియాడారు.
సజ్జనార్ వ్యాఖ్యల ముఖ్యాంశాలు:
రజనీకాంత్ తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఒక్క వాణిజ్య ప్రకటనలో కూడా నటించకపోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం అని అన్నారు.
కొందరు ప్రముఖులు కేవలం డబ్బు కోసం సమాజానికి హాని కలిగించే ఉత్పత్తులు, బెట్టింగ్ యాప్‌లు, మోసపూరిత మార్కెటింగ్ సంస్థలుకి ప్రచారం చేస్తూ, ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ రజనీకాంత్ మాత్రం అభిమానులను మోసం చేయకూడదనే సంకల్పంతో వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉండటం ఎంతో అభినందనీయమని తెలిపారు.
ప్రస్తుత తరం సెలబ్రిటీలు రజనీకాంత్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
సజ్జనార్ హితవు:
“డబ్బే ముఖ్యం, సమాజం ఏమైపోయినా పర్వాలేదు అనుకునే ధోరణిని సెలబ్రిటీలు విడిచి పెట్టాలి. ప్రజల జీవితాలతో ఆడుకునే సంస్థల ప్రచారానికి దూరంగా ఉండాలి. రజనీ గారిలా సమాజ శ్రేయస్సు కోసంఆలోచించాలి.”