Hca: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అక్రమాల వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర పోషించారని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన—హెచ్‌సీఏ అవకతవకల్లో క్విడ్‌ప్రోకో డీల్స్ జరిగాయని వ్యాఖ్యానించారు.
సీఐడీ దర్యాప్తులో మరిన్ని నిజాలు బయటపడతాయని వెల్లడించారు.
అన్ని రాష్ట్ర అసోసియేషన్లు బీసీసీఐ నిబంధనలు పాటించాల్సిందేనని గుర్తు చేశారు.
👉 ఆయన ప్రధాన ఆరోపణలు:
కోర్టుల్లో కేసులు వేసి, హెచ్‌సీఏ తరఫున అవకతవకలకు పాల్పడ్డారని విమర్శ.
కమిటీల్లో మంత్రులు ఉండకూడదన్న నియమం ఉన్నప్పటికీ, బీసీసీఐ ఐటీ సబ్ కమిటీలో కేటీఆర్ కొనసాగారని ఆరోపణ.
కేటీఆర్ బంధువు రాజ్ పాకాలకు బీసీసీఐ టిక్కెట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపించారు.
గత 10 ఏళ్లుగా ఒకే ఆడిట్ రిపోర్టును కాపీ పేస్ట్ చేసి పాస్ చేస్తూ అక్రమాలు జరిగాయని వ్యాఖ్యానించారు.
ప్రతి సంవత్సరం క్లబ్బుల అభివృద్ధి కోసం రూ. 6.10 కోట్లు ఇస్తున్నప్పటికీ, టీమ్‌లు లేని క్లబ్బులకు కూడా నిధులు మంజూరు చేసినట్లు అన్నారు.
హెచ్‌సీఏ పరిపాలనకు నెలకు రూ. 12 కోట్లు కేటాయించగా, ఆ మొత్తం ఎక్కడ ఖర్చు చేశారో చెప్పలేకపోతున్నరని ప్రశ్నించారు.
