Vallabhaneni Vamsi: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్రమ మైనింగ్ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణను మే 22కి వాయిదా వేసింది. వంశీపై గన్నవరం పోలీసులు అక్రమ మైనింగ్ కేసు నమోదు చేయగా, ఆయన హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం, పీటీ వారెంట్‌పై నిర్ణయం తీసుకోవచ్చని దిగువ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, ఈ నెల 22 వరకు పీటీ వారెంట్ అమలుపై స్టే విధించింది.
వంశీపై ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఆయనకు బెయిల్ లభించినప్పటికీ, అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం వచ్చే వరకు ఆయన విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటారు.
ఇది కూడా చదవండి: VC.Sajjanar: ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయడంతో.. లక్ష 20 వేలు ఆదా చేస్తున్న మహిళలు..
వంశీ ఆరోగ్య పరిస్థితి విషయంలో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. జైల్లో ఆయన శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నారని, వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.
ఈ కేసులో తదుపరి విచారణ మే 22న జరగనుంది. వంశీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించనున్నారు. కోర్టు నిర్ణయం వంశీకి ఊరట కలిగిస్తుందా, లేదా అన్నది ఆ రోజు తేలనుంది.