Uttam kumar reddy: అనుమతులు ఉన్న వాటిని హైడ్రా కూల్చివేయదు

హైదరాబాద్‌ను ప్రపంచస్థాయిలో నిలపడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.అనుమతులు ఉన్న వాటిని హైడ్రా కూల్చివేయదని స్పష్టం చేశారు. తాను మరోసారి స్పష్టంగా చెబుతున్నానని… గతంలో అనుమతులు ఉన్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేయదని పునరుద్ఘాటించారు. యుద్ధ ప్రాతిపదికన మెట్రో విస్తరణ చేస్తున్నట్లు చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఓఆర్ఆర్‌ను నిర్మించిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మిస్తోందన్నారు.

కాగా, హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్, బీజేపీ సహా విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మూసీ పరీవాహక ప్రాంతంలోని నిర్వాసితులకు మద్దతుగా బీజేపీ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Shikha Goyal: పండగ పూట అలర్ట్ గా ఉండండి.. గిఫ్టులకు లొంగకండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *