Unstoppable with NBK S4: బాలకృష్ణ ‘అన్ స్టాబబుల్4’ రసవత్తరంగా సాగుతోంది. గత రెండు ఎపిసోడ్స్ లో అల్లుఅర్జున్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ మెరిశారు. ఇక తదుపరి ఎపిసోడ్ లో ‘కిస్సిక్…’ తార శ్రీలీల, నవీన్ పోలిశెట్టి సందడి చేయబోతున్నారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ అయింది. ‘మీరు ఎమ్ ఎల్ ఎ, నేను ఎమ్ ఎల్ ఎ. మీరేమో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నేను మెంబర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అసోసియేషన్’ అని నవీన్ ఆరంభంలోనే నవ్వించేశాడు. ఆడిషన్స్ ప్రస్తావన రాగా ‘చిప్స్ యాడ్ ఆడిషన్’లో తనకు సిక్స్ ప్యాక్ లేదని రిజెక్ట్ చేశారు. చిప్స్ తినేవాడికి సిక్స్ ప్యాక్ ఎక్కడ నుంచి వస్తుందని వాపోయాడు నవీన్. శ్రీలీల ఎం.బి.బిఎస్ కోర్సును మూడు సాంగ్స్ల ఓ పోల్చటం, డేట్ విషయం ప్రస్తావనకు వచ్చినపుడు శ్రీలీల, నవీన్ రియాక్షన్స్,’పుష్ఫ2’లోని ‘కిస్సిక్…’ సాంగ్ కి బాలకృష్ణ, నవీన్ పోలిశెట్టి, శ్రీలీల డాన్స్ చేయటం వంటివి తెగ ఆకట్టుకుంటున్నాయి. నవీన్ తన కామెడీ టైమింగ్ తో ఎపిసోడ్ లో డామినేట్ చేసినట్లు అనిపిస్తోంది. మరి ప్రోమోతోనే ఆకట్టుకుంటున్న ఈ ఎపిసోడ్ ఫుల్ గా ఇంకెంతలా అలరిస్తుందో చూడాలి.
