Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సినిమా మొదట ‘తేరి’ చిత్రానికి రీమేక్‌గా ప్రారంభమైంది. కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరణ జరిగిపోయింది. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితులు మారాయి. పవన్ కళ్యాణ్ స్వయంగా స్క్రిప్ట్‌ను పూర్తిగా మార్చాలని టీమ్‌ను ఆదేశించారు. రొమాన్స్ సన్నివేశాలు, పాటలు వంటి అంశాలను తొలగించి, సినిమాను పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. దర్శకుడు హరీష్ శంకర్ ఈ కొత్త స్క్రిప్ట్‌తో సినిమాను ఎలా మలుస్తారనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఈ మార్పులతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ రాజకీయ విజయం తర్వాత తీసుకున్న ఈ నిర్ణయం సినిమా కథను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందో చూడాలి.
