TVK President Actor Vijay

TVK President Actor Vijay: మహిళల భద్రత కేకలు స్టాలిన్ అంకుల్ వినలేదా?

TVK President Actor Vijay: మధురైలో జరిగిన తమిళనాడు విక్టరీ పార్టీ (తేవాగ) రెండో రాష్ట్ర సమావేశంలో పార్టీ అధినేత విజయ్ ఘాటు స్వరంతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మహిళల భద్రతపై సీఎం ఎం.కె. స్టాలిన్‌పై ఆయన నేరుగా ప్రశ్నలు సంధించారు.

విజయ్ మాట్లాడుతూ.. “మనం తప్పు చేస్తే దాన్ని అంగీకరిస్తాం, వదిలేస్తాం. కానీ స్టాలిన్ మామ చేసిన బూటకపు నాటకాలు మాత్రం ప్రజలు ఎప్పటికీ మరచిపోవు. మీ ప్రభుత్వం నిజాయితీగా ఉందా? అవినీతి రహితంగా ఉందా? మహిళలకు భద్రత ఉందా? నాకు సమాధానం చెప్పండి అంకుల్” అంటూ ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: TVK President Actor Vijay: సింహం సింహమే.. సింహం వేటకు బయల్దేరిందన్న విజయ్‌

అభద్రతాభావంతో ఆడవాళ్లు చేస్తున్న కేకలు వినిపించలేదా అని ఆయన ప్రశ్నిస్తూ, “మహిళలకు రక్షణ ఇవ్వకుండా, వారిని కాపాడకుండా ఆయనను నాన్న అని పిలవడం ఎలా న్యాయం అవుతుంది? స్టాలిన్ అంకుల్… ఇది చాలా తప్పు అంకుల్” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలతో సభ ప్రాంగణంలో కాసేపు హర్షధ్వానాలు మార్మోగాయి. విజయ్ మాటల్లో ఉన్న ధైర్యం, ప్రభుత్వంపై చేసిన ప్రత్యక్ష ఆరోపణలు సభలో ఉన్న వారిలో ఉత్సాహాన్ని నింపాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Eyes: కళ్ళు పసుపు రంగులోకి మారితే సంకేతాలు ఇవే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *