Chittoor: ఆ దంపతులకు ఒక్కడే కొడుకు.. ఆ కొడుకును తల్లిదండ్రులు ఆ బిడ్డను అల్లారుముద్దుగా పెంచుతున్నారు..అయితే, ఆ బాబుకు ఒక్కసారిగా అనారోగ్యం రావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు.. ఎంత వైద్యం చేసిన ఫలితం లేకపోవడంతో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందాడు.. ఏమి జరిగిందో తెలియగా.. కుటుంబ సభ్యులు ఆందోళన.. చివరకు ఎలా జరిగిందో తెలుసా…??
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. టీ.వడ్లూరు గ్రామానికి చెందిన గణేష్ కుమారుడు ఆరోగ్యం బాలేక ఆస్పత్రికి తీసుకువచ్చారు.. అయితే, అక్కడ వైద్యులు సరిగా పట్టించుకోకపోవడం వల్ల మా బిడ్డ చిన్నారి మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గతంలో కూడా మా బంధువుల్ని ఇక్కడున్న వైద్యులు పట్టించుకోకపోవడం వల్లే మృతి చెందాడని ఆందోళన చేపట్టారు.
Also Read: Crime News: మూడేళ్ల కూతురుకు ఉరేసి చంపింది.. అదే ఉరికి తల్లీ బలి
పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి రావాలంటేనే భయంగా ఉందంటూ కుటుంబ సభ్యులు కన్నీటి పర్వంతమయ్యారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ.. అనారోగ్య కారణంగా బాబుని ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం కోసం తీసుకురావడం జరిగిందని, పరిశీలించగా లంగ్స్‌లోకి పాలు వెళ్లిపోవడంతో ట్యూబులు వేసి చికిత్స అందించే ప్రయత్నాలు చేసిన కూడా బాబు మృతి చెందాడని తెలిపారు.
కాగా, బాబును తల్లిదండ్రులు గత మూడు రోజుల నుంచి చిత్తూరు ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేసి చూపించారు.. అయితే అనారోగ్యంతో ఉండడంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు.. చాలా పీక్ స్టేజ్‌లో బాబును తీసుకురావడంతో.. అన్ని విధాల చేయాల్సిన ట్రీట్మెంట్ ను అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసిన దురదృష్టకరంగా బాబు మరణించారని, ఇందులో తమ నిర్లక్ష్యం లేదన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.